Bulldozer Justice: నిందితుడైతే.. ఆ వ్యక్తి ఇంటిని కూల్చేస్తారా.. బుల్డోజర్ చర్యలపై సుప్రీం ఆగ్రహం
Bulldozer Justice: క్రిమినల్ కేసులో నిందితుడైతే, అతని ఇంటిని కూల్చేస్తారా. ఇదేక్కడి న్యాయం అని సుప్రీంకోర్టు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న కూల్చివేతల గురించి దాఖలైన పిటీషన్‌పై సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు సీరియస్ అయ్యింది.
న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయం పేరుతో జరుగుతున్న చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటిని ఎలా బుల్డోజర్లతో కూల్చివేస్తారని కోర్టు ప్రశ్నించింది. పిటీషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దావే కోర్టులో వాదించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బుల్డోజర్ చర్యలను ఆపాలని ఆయన ఆ పిటీషన్లో కోరారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం ఇచ్చారు.
ఒక వ్యక్తి నేరంలో నిందితుడిగా ఉన్నంత మాత్రాన , అతని స్థిరాస్తిని నేలమట్టం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. ఒకవేళ ఆ కట్టడం కనుక అక్రమం అయితే, అప్పుడు మాత్రమే దాన్ని కూల్చివేయడం జరుగుతుందని తుషార్ చెప్పారు. ఇలాంటి సందర్భంలో తాము కొన్ని మార్గదర్శకాలు ఇస్తామని, నిందితుడో లేక దోషి అయినంత మాత్రాన ఆ వ్యక్తి ఇంటిని ఎలా కూల్చుతారని జస్టిస్ గవాయి అడిగారు.
ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎందుకు సూచనలు చేయడం లేదని జస్టిస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. ముందు నోటీసు ఇవ్వాలని, రిప్లై ఇచ్చేందుకు టైం ఇవ్వాలని, కోర్టు ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత కూల్చివేత ప్రక్రియ చేపట్టాలని జస్టిస్ విశ్వనాథన్ తెలిపారు. అక్రమ నిర్మాణాలను తమ ధర్మాసనం సమర్థించడం లేదని ఆయన అన్నారు. కానీ డెమోలిషన్కు మాత్రం మార్గదర్శకాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

