ఒవైసీపై హత్యాయత్నం.. యూపీ సర్కారుకు ‘సుప్రీం’ నోటీసులు
Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్
న్యూఢిల్లీ : ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒవైసీ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 3న తనపై దాడికి యత్నించిన నిందితులకు బెయిల్ మంజూరైందని ఒవైసీ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బెయిల్ ఆర్డర్‌ను ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా? వద్దా? అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నవంబర్ 11న ఈ అంశంపై మరోసారి విచారణను సుప్రీంకోర్టు చేపట్టనుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హపూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓవైసీ, ఆయన కాన్వాయ్‌పై ఇద్దరు నిందితులు శుభమ్, సచిన్ కాల్పులు జరిపారు.
కాల్పుల్లో ఒవైసీ తృటిలో తప్పించుకున్నారు. నిందితులిద్దరిపై యూపీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. నిందితులు శుభమ్, సచిన్ విడుదలైన తర్వాత స్వగ్రామానికి చేరుకోగా.. అక్కడి పలు సంఘాలు వారికి స్వాగతం పలికాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

