Justice Nariman: రిటైరైన జస్టిస్ నారీమన్.. ఓ న్యాయ సింహాన్ని కోల్పోతున్నామన్న సీజే

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్ ( Justice Rohington Fali Nariman ) ఇవాళ రిటైర్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత.. సుప్రీంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రెండవ జడ్జి ఆయన. ఉత్తమ ప్రొఫైల్ ఉన్న నారీమన్ అనేక కీలక తీర్పులను వెలువరించారు. రోహింగ్టన్ రిటైర్మెంట్ సందర్భంగా సుప్రీం జడ్జిలు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఫేర్వెల్ కార్యక్రమంలో సీజే ఎన్వీ రమణ మాట్లాడుతూ.. నారీమన్ జ్ఞానాన్ని, మెధస్సును ఈ సంస్థ కోల్పోతుందన్నారు. బలమైన న్యాయవ్యవస్థలో ఆయన ఒక పిల్లర్ అన్నారు. నారీమన్ ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడ్డట్లు సీజే చెప్పారు. ఈ క్షణం కొంత ఉద్విగ్నంగా ఉందని, నా ఆలోచనల్ని వ్యక్తపరచడం ఇబ్బందిగా ఉందని సీజే రమణ అన్నారు.
ఇవాళ చివరి రోజు కావడం వల్ల.. కోర్టు నెంబర్ వన్‌లో సీజే రమణతో కలిసి నారీమన్ కూర్చుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన జస్టిస్ నారీమన్ 35 ఏళ్ల పాటు న్యాయవృత్తిలో కొనసాగారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారీమన్ కుమారుడే రోహింగ్టన్ నారీమన్. 37 ఏళ్ల వయసులో సీనియర్ లాయర్‌గా సుప్రీంకోర్టులో రోహింగ్టన్ నియమితులైయ్యారు. 2011లో ఆయన్ను సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించారు. నేరుగా సుప్రీం జడ్జిగా నియమితులైన అయిదవ లాయర్ ఆయన. జస్టిస్ నారీమన్ ఇప్పటి వరకు 13,565 కేసులను వాదించినట్లు సీజే రమణ తెలిపారు.
ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేసింది జస్టిస్ నారీమన్. హోమోసెక్స్పై ఇచ్చిన తీర్పులో ఆయన ధర్మాసనాన్ని పంచుకున్నారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకోరాదు అని ఓ తీర్పులో చెప్పారు. కస్టడీ మరణాల విషయంలో పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు అమర్చాలని ఆదేశించారు. తాజా తీర్పులో రాజకీయ నేరచరితులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. న్యాయవ్యవస్థను సింహంలా కాపాడిన జస్టిస్ నారీమన్‌ను కోల్పోతున్నామని సీజే రమణ తన నివాళిలో పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

