నీట్‌పై విచారణ జూలై 18కి వాయిదా
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై విచారణను జూలై 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలపై విచారణ జరిపించాలని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నది.
న్యూఢిల్లీ, జూలై 11: నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై విచారణను జూలై 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలపై విచారణ జరిపించాలని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తున్నది.
ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన జాతీయ పరీక్ష సంస్థ(ఎన్టీఏ)ను ఇంతకుముందు కోర్టు ఆదేశించింది. బుధవారం కేంద్రం, ఎన్టీఏ వేర్వేరుగా స్పందనను తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేశాయి. గురువారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ ప్రారంభించింది. పరీక్షలో అక్రమాలపై సీబీఐ జరుపుతున్న విచారణ పురోగతిపై తమకు నివేదిక అందినట్టు కోర్టు పేర్కొన్నది.
అయితే, తమకు కేంద్రం, ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లు అందలేదని పలువురు పిటిషన్‌దారులు ధర్మాసనానికి తెలిపారు. దీంతో జూలై 15కు విచారణ వాయిదా వేస్తామని ధర్మాసనం చెప్పింది. అయితే, ఆ రోజు తాను అందుబాటులో ఉండనని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీంతో విచారణను జూలై 18కి కోర్టు వాయిదా వేసింది. కాగా, నీట్లో సామూహిక మాల్‌ప్రాక్టీస్ జరగలేదని, కాబట్టి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పేపర్ లీక్ సూత్రధారి రాకీ అరెస్టు
నీట్-యూజీ పేపర్ లీక్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది. పేపర్ లీక్ వెనుక మాస్టర్‌మైండ్‌గా అనుమానిస్తున్న రాకేశ్ రంజన్ అలియాస్ రాకీని అరెస్టు చేశామని సీబీఐ అధికారులు గురువారం వెల్లడించారు. కోర్టు అతడికి 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు. సీబీఐ అధికారులు పట్నా, కోల్‌కతా సమీపంలో పలు చోట్ల దాడులు నిర్వహించగా, రాకేశ్ రంజన్ పట్టుబడ్డాడని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

