Lakhimpur Kheri Violence | లఖీంపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టులో విచారణ.. ప్రభుత్వ తీరుపై సీజేఐ అసంతృప్తి
Lakhimpur Kheri Violence | దేశంలో కలకలం రేపిన లఖీపూర్ ఖేరి హింసపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు.

లక్నో: దేశంలో కలకలం రేపిన లఖీపూర్ ఖేరి హింసపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. అక్టోబరు 3న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
సిట్ నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది. యూపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ నివేదికను సమర్పించేందుకు శుక్రవారం వరకూ గడువు కోరారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ నివేదికను సాల్వే న్యాయస్థానానికి సమర్పించారు.
ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై చీఫ్ జస్టిస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నివేదిక కోసం మంగళవారం రాత్రి చాలాసేపు న్యాయమూర్తులు ఎదురు చూశారు. మీరు ఇప్పుడు నివేదిక సమర్పిస్తున్నారు’’ అంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే సీల్డు కవరులో వచ్చిన రిపోర్టులో కేవలం నలుగురు సాక్షుల వాంగ్మూలాలే ఉన్న విషయాన్ని కూడా సీజేఐ ఎత్తిచూపారు.
‘‘సాక్షుల్లో ఎవరికి బెదిరింపులు, హాని కలిగే ప్రమాదం ఉందో మీ సిట్ గుర్తించగలదు. అలాంటప్పుడు కేవలం నలుగురు సాక్షుల వాంగ్మూలాలే ఎందుకు తీసుకున్నారు?‘‘ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో సాక్షులకు రక్షణ కల్పిస్తామని యూపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ కేసులో దర్యాప్తు ముగింపు లేని కథలా మిగలకూడదని, పోలీసుల దర్యాప్తు నత్త నడకన సాగుతోందనే అనుమానాలను ప్రభుత్వమే చెరిపివేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
మిగతా సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించడం కోసం యూపీ ప్రభుత్వం సమయం అడగడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అక్టోబరు 26లోపు తదుపరి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

