NewsClick Editor: న్యూస్‌క్లిక్ ఎడిటర్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
NewsClick editor: న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రభిర్ పుర్కయస్తను తక్షణమే రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉగ్రవాద చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ ఎడిటర్(NewsClick Editor) ప్రభిర్ పుర్కయస్తను తక్షణమే రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉగ్రవాద చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు వెల్లడించింది. జస్టిస్ బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాలని ధర్మాసనం తెలిపింది. అందుకే ఎడిటర్ అరెస్టును కోర్టు తప్పుపట్టింది. ఎందుకు అరెస్టు చేశారన్న అంశానికి సంబంధించిన విషయాలను కోర్టుకు వెల్లడించలేదని, పంకజ్ బన్సల్ కేసు తరహాలో అతన్ని కస్టడీ నుంచి రిలీజ్ చేయాలని ఆదేశిస్తున్నామని, రిమాండ్ ఆర్డర్ చెల్లదని జస్టిస్ మెహతా తెలిపారు.
పుర్కయస్తను గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు. చైనా ఏజెండా గురించి కథనాలు రాస్తున్న న్యూస్‌క్లిక్ సంస్థకు అక్రమంగా నిధులు వస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆరోపణలు చేసింది. ఆ కేసులో న్యూస్‌క్లిక్ ఎడిటర్‌ను అరెస్టు చేశారు. చైనాకు అనుకూలంగా రాసేందుకు టెర్రర్ ఫండింగ్ జరిగినట్లు 8వేల పేజీల ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. న్యూస్‌క్లిక్ హెచ్ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని కూడా అక్టోబర్ 3వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

