MP Raghav Chadha: ఎంపీ రాఘవ చద్దా క్షమాపణలు చెప్పాల్సిందే: సుప్రీంకోర్టు
MP Raghav Chadha: ఆమ్ ఆద్మీ ఎంపీకి సుప్రీంకోర్టు జలక్ ఇచ్చింది. రాజ్యసభ చైర్మెన్‌కు ఎంపీ రాఘవ క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరింది. సెలెక్ట్ కమిటీ అంశంపై బీజేపీ ఎంపీలు చేసిన ఫిర్యాదు కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ కేసులో ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ చద్దా(MP Raghav Chadha).. రాజ్యసభ నుంచి నిరవధికంగా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్‌కు ఆ ఎంపీ షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాల్సిందే అని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. సెలెక్ట్ కమిటీ అంశం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఒకవేళ ఎంపీ రాఘవ క్షమాపణలు చెబితే, అప్పుడు రాజ్యసభ చైర్మెన్ ఆ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టు వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ కేసులో ఆదేశాలు జారీ చేసింది. దివాళీ సెలవులు తర్వాత ఈ అంశంపై అప్డేట్ ఇవ్వాలని కూడా అటార్నీ జనరల్ వెంకటరమణిని కోర్టు ఆదేశించింది.
రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్‌ను ఎంపీ రాఘవ చద్దా వ్యక్తిగతంగా కలుసుకోవాలని, ఆయనకు ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెప్పాలని సీజేఐ తెలిపారు. ఆగస్టు 11వ తేదీ నుంచి రాఘవ చద్దాపై సస్పెన్షన్ అమలులో ఉన్నది. ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై తమ అనుమతి లేకుండా తీర్మానంపై తమ పేర్లను చేర్చాలని బీజేపీ ఎంపీలు ఎంపీ రాఘవపై ఫిర్యాదు చేశారు. ఆ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ రాఘవ కోరారు. అయితే ఈ అంశాన్ని బీజేపీ ఎంపీలు తప్పుపట్టారు. తమ ఆమోదం తెలిపినట్లు బీజేపీ ఎంపీలపై రాఘవ పేర్కొన్నా.. ఆ ఎంపీలు మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాఘవపై చైర్మెన్ సస్పెన్షన్ విధించారు. ప్రివిలేజ్ కమిటీ వద్ద ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
రాజ్యసభ చైర్మెన్‌కు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీ రాఘవ కోర్టుకు వెల్లడించారు. నిరవధిక సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్యసభ రూల్స్, రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినట్లు ఆయన తన అఫిడవిట్లో ఆరోపించారు. సస్పెన్షన్ వల్ల పలు కమిటీల మీటింగ్‌కు హాజరుకాలేకపోతున్నట్లు ఎంపీ కోర్టుకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

