Sukhjider Singh Randhawa: పంజాబ్ కొత్త సీఎంగా సుఖ్జిందర్ సింగ్ రణ్‌దవా ఎంపిక
Sukhjider Singh Randhawa: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్జిందర్ సింగ్ రణ్‌దవా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఒక ప్రకటన చేసింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో

చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వివాదరహితుడిగా పేరున్న సుఖ్జిందర్ సింగ్ రణ్‌దవాను ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పంజాబ్ కొత్త సీఎంగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్‌కు పార్టీ పరిశీలకులుగా వచ్చిన సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జి హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం నుంచి ఎమ్మెల్యేలతో సుదీర్ఘ చర్చలు జరిపి కొందరి పేర్లను ప్రతిపాదించడంతో.. కాంగ్రెస్ అధిష్ఠానం వారిలో నుంచి సుఖ్జిందర్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
కాగా, పంజాబ్ కాంగ్రెస్‌లో గత ఐదు నెలలుగా అంతర్గత విభేదాలు తలెత్తాయి. సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పలుమార్లు ఇద్దరినీ పిలిపించి మాట్లాడినా వివాదం సద్దుమణగలేదు. దాంతో కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం సాయంత్రం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీష్ రావత్‌కు సూచించింది. దాంతో హరీష్ రావత్ శనివారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ భేటీకి హాజరు కావాలని అదేరోజు ఉదయం ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో సీఎల్పీ భేటీ జరుగకముందే కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ హైకమాండ్ తనను అవమానించిందని ఆరోపించారు. సిద్ధూకు పాకిస్థాన్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఆయన సీఎం పదవి కట్టబెడితే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత సాయంత్రం జరిగిన సీఎల్పీ భేటీలో పంజాబ్ కొత్త సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు కట్టబెడుతూ తీర్మానం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సుఖ్జిందర్ రణ్‌దవాను పంజాబ్ కొత్త సీఎంగా ఎంపిక చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

