Cow Smuggler: గోవుల స్మగ్లర్ అనుకుని.. 30 కిలోమీటర్లు ఛేజ్ చేసి.. విద్యార్థిని కాల్చి చంపారు
Cow Smuggler: గోవులు స్మగ్లింగ్ చేస్తున్నాడనుకుని ఓ విద్యార్థిని హర్యానాలో కాల్చి చంపారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం కారులో వెంబడించి ఆ విద్యార్థిని హతమార్చారు. ఆగస్టు 23వ తేదీన జరిగిన ఈ ఘటనలో అయిదుగుర్ని అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: హర్యానాలోని ఫరీదాబాద్‌లో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని గో సంరక్షకులు కాల్చి చంపారు. గోవులను స్మగ్లింగ్(Cow Smuggler) చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆ స్టూడెంట్‌పై అటాక్ చేశారు. ఆగస్టు 23వ తేదీన జరిగిన ఈ ఘటనలో గోసంరక్షణ గ్రూపునకు చెందిన అయిదుగుర్ని అరెస్టు చేశారు. నిందితులను అనిల్ కౌశిక్, వరున్, కృష్ణ, ఆదేశ్, సౌరభ్‌గా గుర్తించారు. బాధితుడిని ఆర్యన్ మిశ్రాగా గుర్తించారు. మిత్రులు శాంకీ, హర్షిత్‌తో వెళ్తున్న ఆర్యన్‌ను గోవులను స్మగ్లింగ్ చేసే వ్యక్తులుగా భావించి నిందితులు వెంటబడ్డారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం కారులో ఛేజ్ చేశారు. హర్యానాలోని ఢిల్లీ-ఆగ్రా హైవేపై ఈ ఘటన జరిగింది.
రెనాల్ట్ డస్టర్, టొయోటా ఫార్చూనర్లో కొందరు ఆవులను స్మగ్లింగ్ చేసేవాళ్లు రెక్కీ వేస్తున్నట్లు గో సంరక్షకులకు సమాచారం అందింది. స్మగ్లర్ల కోసం వెతుకుతున్న సమయంలో.. విద్యార్థులు ప్రయాణిస్తున్న డస్టర్ కారును పటేల్ చౌక్ వద్ద గుర్తించారు. డ్రైవర్ సీటులో ఉన్న హర్షిత్ కారును ఆపలేదు. అయితే నిందితులు ఆ సమయంలో కాల్పులు జరిపాడు. ముందు సీటులో కూర్చున్న ఆర్యన్‌కు బుల్లెట్ తగిలింది. కారు ఆగిన తర్వాత కూడా ఆర్యన్‌ను మరోసారి నిందితులు షూట్ చేశారు.
కారులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించిన నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆర్యన్‌ను ఆస్పత్రిగా తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. నిందితులు వాడిన వెపన్ అక్రమమైందని తేలింది. ప్రస్తుతం వాళ్లు పోలీసు కస్టడీలో ఉన్నారు. దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

