న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో మనసును తేలికపరిచే వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తే హృదయాన్ని తాకే వీడియోలు (viral video) మరికొన్ని కనిపిస్తాయి. ఓ చిరువ్యాపారి పేదరికాన్ని కండ్లకు కట్టే వీడియో ఇప్పుడు అందరి హృదయాలను మెలిపెట్టేస్తోంది. మన చుట్టూ ఎంతోమంది ఎన్నో సమస్యల్లో కూరుకుపోయిన వారున్నారని ఈ వీడియో కండ్లకు కడుతుంది.
కనీస అవసరాలకు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారో తాజా వీడియో వెల్లడిస్తోంది. ఆన్లైన్ బ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఫ్లూట్ సెల్లర్ ఆవేదన అందరినీ కదిలిస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో ఫ్లూట్ సెల్లర్ను బ్లాగర్ కలుసుకోగా అతడితో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనైన చిరువ్యాపారి కంటనీరు ఒలుకుతుంది.
వేణువులను విక్రయిస్తూ రోజంతా కష్టపడితే తనకు కేవలం రూ. 60 మిగులుతాయని అతడు చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు. తాను ఉదయం నుంచి భోజనం కూడా చేయకుండా కష్టపడితే తన జేబులో రూ. 60 మాత్రమే మిగిలాయని చెప్పడం నెటిజన్లను కదిలిస్తుంది. అతడి పరిస్ధితి చూసిన నెటిజన్లు పెద్దసంఖ్యలో అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అతడికి సాయం చేయాలంటే ఎలా కలుసుకోవాలని పలువురు కామెంట్స్ సెక్షన్లో ఎంక్వయిరీ చేశారు.
Read More