Air Quality: ఢిల్లీని కమ్మేసిన దుమ్ము.. తగ్గిన గాలి నాణ్యత
Air Quality: ఢిల్లీలో అయిదు రోజుల నుంచి ఉత్తరాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడ వాతావరణం దుమ్ము దుమ్ముగా మారిపోయింది. 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న కారణంగా ఎక్కువ దుమ్ము లేస్తోంది. పీఎం10 కాన్సెంట్రేషన్ స్థాయి 140 మైక్రోగ్రామ్స్ నుంచి 775 మైక్రోగ్రామ్స్ పెరిగింది. బలమైన గాలుల వల్లే దుమ్ము వ్యాపిస్తోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం బలమైన గాలులు వీచాయి. దీంతో విపరీతంగా దుమ్ము లేచింది. ఆ కారణంగా అక్కడి గాలి నాణ్యత(Air Quality) దారుణంగా పడిపోయింది. విజిబులిటీ వెయ్యి మీటర్ల లోపే తగ్గినట్లు ఐఎండీ తెలిపింది. గత అయిదు రోజుల నుంచి ఉత్తరాదిలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడ వాతావరణం దుమ్ము దుమ్ముగా మారిపోయింది. 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న కారణంగా ఎక్కువ దుమ్ము లేస్తోందని, పీఎం10 కాన్సెంట్రేషన్ స్థాయి 140 మైక్రోగ్రామ్స్ నుంచి 775 మైక్రోగ్రామ్స్ పెరిగిందని, బలమైన గాలుల వల్లే దుమ్ము వ్యాపిస్తోందని, అయితే అది త్వరలోనే సెటిల్ అవుతుందని ఐంఎడీ అధికారి వీకే సోని తెలిపారు.
గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. ఇవాళ సాయంత్రం వరకు స్వల్పంగా మేఘాలు ఏర్పడనున్నాయని, కొన్ని చోట్ల జల్లుల వల్ల కూడా రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆదివారం వరకు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని ఐంఎడీ అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

