stray dogs enter Gaya temple | గయా ఆలయంలోకి ప్రవేశించిన కుక్కలు.. భయాందోళన చెందిన బౌద్ధ భక్తులు
stray dogs enter Gaya temple | బీహార్లోని ప్రముఖ బుద్ధ గయా ఆలయంలోకి కుక్కలు ప్రవేశించాయి. (stray dogs enter Gaya temple) అవి అక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తున్న విదేశీ బౌద్ధ భక్తులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: బీహార్లోని ప్రముఖ బుద్ధ గయా ఆలయంలోకి కుక్కలు ప్రవేశించాయి. (stray dogs enter Gaya temple) అవి అక్కడ బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తున్న విదేశీ బౌద్ధ భక్తులు భయాందోళన చెందారు. కొందరు అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గయాలోని మహాబోధి ఆలయాన్ని ప్రతి ఏటా అనేక మంది విదేశీ పర్యటకులు సందర్శిస్తారు. బౌద్ధ ఆలయంలోని బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తారు.
కాగా, ఈ ఆలయంలోకి వెళ్లేందుకు, వచ్చేందుకు ఒక్క ద్వారం మాత్రమే ఉంది. ఆ ద్వారం వద్ద కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు ఉంటాయి. అయితే గురువారం కొన్ని వీధి కుక్కలు ఆ ద్వారం దాటి మహాబోధి ఆలయంలోకి ప్రవేశించాయి. పెద్దగా మెరుగుతూ బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ బోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేస్తున్న విదేశీ బౌద్ధ భక్తులు భయాందోళన చెందారు. కొందరు అక్కడి నుంచి దూరంగా పారిపోయారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్న గేట్ ద్వారా ఆలయంలోకి కుక్కలు ప్రవేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆ ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లపై కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
बोधगया: महाबोधी मंदिर में पूजा स्थल तक घुसा स्ट्रीट डॉग, मची भगदड़#Bihar #StreetDog #BodhGaya #MahabodhiTemple #DigitalVideos pic.twitter.com/gXtQ2h8ySV
— Zee News (@ZeeNews) November 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Devotees
- Enter
- Gaya temple
- scatter
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

