వ్యక్తి ప్రైవేట్ భాగాల్లో స్టీల్ గ్లాస్ : సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
ఓ వ్యక్తి ప్రైవేట్ భాగంలో అతడి స్నేహితులు పదిరోజుల కిందట గాజు గ్లాసును చొప్పించగా ఒడిషాలోని బెర్హంపూర్‌లో సర్జన్లు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు.
భువనేశ్వర్ : ఓ వ్యక్తి ప్రైవేట్ భాగంలో అతడి స్నేహితులు పదిరోజుల కిందట స్టీల్ గ్లాసును చొప్పించగా ఒడిషాలోని బెర్హంపూర్‌లో సర్జన్లు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ ఆసుప్రతిలో విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. బాధితుడు తాగిన మైకంలో ఉండగా అతడి మలద్వారంలో స్నేహితులు స్టీల్ గ్లాసును చొప్పించారు.
గుజరాత్‌లోని సూరత్‌లో పనిచేసే కృష్ణ రౌత్ (45) ఫ్రెండ్స్‌తో కలిసి పది రోజుల కిందట పార్టీ చేసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. మరుసటి రోజు నుంచి అతడి ప్రేవుల్లో నొప్పి మొదలైంది. ఆపై నొప్పి భరించలేనంతగా పెరగడంతో గంజాంలోని తన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. అతడి పొట్ట ఉబ్బడం, మలవిసర్జన కష్టం కావడంతో ఎంకేసీజీ ఆస్పత్రికి చెకప్ కోసం వెళ్లాడు. అక్కడి వైద్యులు ఎక్స్‌రే తీయగా ప్రేవుల్లో స్టీల్ గ్లాసు ఉన్నట్టు వెల్లడైంది.
తొలుత మలద్వారం నుంచి గ్లాసును బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించి విఫలం కావడంతో సర్జరీ ద్వారా ప్రేవుల నుంచి గాజు గ్లాసును తొలగించారు. సర్జరీ అనంతరం కృష్ణ రౌత్ కోలుకుంటున్నాడని, ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- MAN
- Odisha
- Private Parts
- removed
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

