నీట్ బిల్లు విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ గవర్నర్ రవిపై మళ్లీ భగ్గుమన్నారు. ఈ బిల్లు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం లేదని, ఓ పోస్ట్‌మ్యాన్ లాగా దానిని రాష్ట్రపతి అనుమతి కోసం పంపాలనే తాము డిమాండ్ చేస్తున్నామని సీఎం కటువుగా వ్యాఖ్యానించారు.
నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని అసెంబ్లీ ఆమోదించిన రెండో బిల్లుకు ఆమోదం తెలిపే అధికారం గవర్నర్‌కు లేదని సీఎం పేర్కొన్నారు. సోమవారం డీఎంకే ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని నీట్ నుంచి మినహాయించాలన్న విషయంలో తాము చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నీట్ బిల్లుకు ఆమోదం తెలపాలని తాము గవర్నర్‌ను కోరడం లేదు. అలా చేయడానికి గవర్నర్‌కు అధికారం కూడా లేదు. ఈ బిల్లును రాష్ట్రపతికి పంపమని మాత్రమే కోరుతున్నాం. మేం అడిగేది అదే అంటూ సీఎం స్టాలిన్ దెప్పిపొడిచారు.