Tamil Nadu | రుపీ సింబల్‌కు రాంరాం.. తమిళనాడులో మరింత ముదిరిన భాషా వివాదం!
తమిళనాట భాషా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో తమిళ పదం రూబాయిని చేర్చి జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) వ్యతిరేకించే విషయంలో తగ్గేది లేదని కేంద్రానికి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన టీజర్‌ను ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
- బడ్జెట్లో అధికారిక రూపాయి చిహ్నం తొలగింపు
- దాని స్థానంలో ‘రూ’ అర్థం వచ్చే తమిళ అక్షరం చేర్పు
- డీఎంకే ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అన్న విపక్షం
- తమిళ భాషను ప్రోత్సహించే ప్రయత్నంగా చూడాలన్న డీఎంకే
Tamil Nadu | చెన్నై, మార్చి 13: తమిళనాట భాషా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025-26 రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం తయారుచేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ఆ స్థానంలో తమిళ పదం రూబాయిని చేర్చి జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) వ్యతిరేకించే విషయంలో తగ్గేది లేదని కేంద్రానికి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 14న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన టీజర్‌ను ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తమిళనాడు సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ బడ్జెట్‌ని రూపొందించినట్టు స్టాలిన్ ట్వీట్ చేశారు.
రూపాయి సింబల్ రూపకర్త డీఎంకే నేత కుమారుడే
ద్రవిడియన్ మోడల్, టీఎన్బడ్జెట్ 2025 హ్యాష్‌ట్యాగులతో విడుదల చేసిన బడ్జెట్ లోగోలో హిందీ అక్షరం ఆర్ స్ఫూర్తితో రూపొందిన అధికారిక రూపాయి చిహ్నం మాయమైంది. ఆ స్థానంలో తమిళ పదం రూబాయికి చిహ్నమైన రూ అనే తమిళ అక్షరం దర్శనమిచ్చింది. గత రెండు వార్షిక బడ్జెట్లలో మాత్రం అధికారిక రూపాయి చిహ్నమే లోగోలలో ఉండడం విశేషం. 2023-24 బడ్జెట్ లోగోలో కూడా అధికారిక రూపాయి చిహ్నమే ఉంది. దీన్ని ఐఐటీ-గువాహటి ప్రొఫెసర్ డిజైన్ చేశారు. ఆయన డీఎంకే నాయకుడు కుమారుడు కావడం గమనార్హం.
రూపాయి చిహ్నాన్ని తిరస్కరించడంగా చూడరాదు..
జాతీయ కరెన్సీ చిహ్నాన్ని ఒక రాష్ట్రం తిరస్కరించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఎన్ఈపీ ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, అధికారిక రూపాయి చిహ్నాన్ని రాష్ట్రం తిరస్కరించడంగా దీన్ని భావించరాదని డీఎంకే అధికార ప్రతినిధి ఏ శరవణన్ పేర్కొన్నారు. తమిళ అక్షరం రూ ఉపయోగించడం ద్వారా తమిళ భాషను ప్రోత్సహించే ప్రయత్నంగా చూడాలని ఆయన తెలిపారు.
తమిళ ప్రజలను నవ్వులపాలు చేశారు: బీజేపీ
అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారిక రూపాయి చిహ్నాన్ని మార్చాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మూర్ఖత్వానికి పరాకాష్టగా అన్నామలై అభివర్ణించారు. యావద్దేశం ముందు తమిళ ప్రజలను నవ్వులపాలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ స్పందిస్తూ ముఖ్యమంత్రి మూర్ఖపు చర్యకు పాల్పడరాదని, రాష్ట్ర హక్కుల పేరిట ప్రజలను రెచ్చగొట్టరాదని చెప్పారు. రూపాయి చిహ్నాన్ని మార్చినందుకు స్టాలిన్‌పై బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ మండిపడ్డారు. డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఉన్నత విద్యావంతుడు, డిజైనర్ ఉదయ కుమార్ ధర్మలింగం భారతీయ రూపాయి చిహ్నాన్ని రూపొందించారని, తమిళనాడు బడ్జెట్ నుంచి అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళ ప్రజలను అవమానించారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

