Srinagar Terrorist Attack | శ్రీనగర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇన్స్పెక్టర్పై కాల్పులు..!
Srinagar Terrorist Attack | శ్రీనగర్‌లో శనివారం ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెమినాలోని హమ్దానియా కాలనీలో ఓ పోలీస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన పోలీస్‌ను మహ్మద్ హఫీజ్‌గా గుర్తించారు.
Srinagar Terrorist Attack | శ్రీనగర్‌లో శనివారం ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెమినాలోని హమ్దానియా కాలనీలో ఓ పోలీస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన పోలీస్‌ను మహ్మద్ హఫీజ్‌గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.
మహ్మద్ హఫీజ్ పొట్టపై, చేతికి గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఒక్కసారిగా కాల్పులు జరుగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. ఎవరికి వారు భయంతో పరుగులు తీస్తూ తమను తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
ఆ తర్వాత స్థానికులకు పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఇటీవల శ్రీనగర్‌లో ఈద్గా ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న ఇన్స్పెక్టర్పై సైతం ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. గాయపడ్డ మస్రూర్ అహ్మద్ 39 రోజుల తర్వాత చికిత్స పొందుతూ డిసెంబర్ 7న ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. ఉగ్రవాదులు అతి సమీపం నుంచి ఇన్స్పెక్టర్ను లక్ష్యంగా చేసుకుని మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

