Ayodhya | అయోధ్య రామయ్యకు సూర్య తిలకం..! ఆలయంలో దర్శన సేవల్లో మార్పులు..!
Ayodhya | శ్రీరామనవమికి అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. 500 సంవత్సరాల తర్వాత వేడుకలు జరుగుతుండడంతో ఘనంగా నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నది. అయితే, శ్రీరామనవమి ఉత్సవం రోజున భక్తులు అపురూప ఘట్టాన్ని వీక్షించబోతున్నారు.
Ayodhya | శ్రీరామనవమికి అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. 500 సంవత్సరాల తర్వాత వేడుకలు
జరుగుతుండడంతో ఘనంగా నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నది. అయితే, శ్రీరామనవమి ఉత్సవం రోజున భక్తులు అపురూప ఘట్టాన్ని వీక్షించబోతున్నారు. బాల రాముడి నుదుటన సూర్య భగవానుడి కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ నెల 17న మధ్యాహ్నం 12.16 గంటలకు దాదాపు ఐదు నిమిషాల ఈ అద్భుత దృశ్యం భక్తులను కనువిందు చేయనున్నది.
ఈ మేరకు సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. సోమవారం అయోధ్యకు చేరుకున్న ఆయన నవమి ఉత్సవాల జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించనున్నారు. రామనవమికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సులభంగా రామ్‌లల్లా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. 19వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీరామ నవమి రోజున రామ్‌లల్లా దర్శన సమయాలు మారుతాయన్నారు. బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారు జామున 3.30 గంటల నుంచి మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, దర్శనాలు ఉంటాయన్నారు. ఉదయం 5.00 గంటలకు శృంగార్ హారతి ఉంటుందని పేర్కొన్నారు. దర్శనాలు, పూజా కార్యక్రమాలు ఏకకాలంలో కొనసాగుతాయని.. నైవేద్యం సమర్పించే సమయంలో కొద్దిసేపు దర్శనాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని.. పరిస్థితులకు అనుగుణంగా భోగ్, శయన హారతి ఉంటుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

