న్యూఢిల్లీ: విమానాల్లో ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతున్నది. సోమవారం స్పైస్ జెట్ విమానంలో సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేసి సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో కేబిన్ సిబ్బందితో ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సిబ్బందిలోని ఒక మహిళను అతడు అనుచితంగా తాకినట్టు ఆరోపణలొచ్చాయి. దీంతో ఆ ప్రయాణికుడిని, అతడితోనే వస్తున్న మరో వ్యక్తిని ఢిల్లీలోనే విమానం నుంచి దింపేసి పోలీసులకు అప్పగించారు.