లక్నో: ఎక్స్‌ప్రెస్ వేపై ఒక కారు రాంగ్ రూట్లో వేగంగా వెళ్లింది. ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొట్టింది. (Speeding SUV hits bike) ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కెమెరాలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శనివారం నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఫార్చ్యూనర్ ఎస్యూవీ వేగంగా తప్పుడు మార్గంలో ప్రయాణించింది. ఈ నేపథ్యంలో ఎదురుగా వచ్చిన ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ మార్గంలో వెళ్తున్న ఒక కారు డ్యాష్ బోర్డ్‌పై ఉన్న కెమెరాలో ఈ ప్రమాదం సంఘటన రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
एक्सप्रेसवे पर परी चौक के पास रॉन्ग साइड तेज रफ्तार फॉर्च्यूनर कार ने मोटरसाइकिल सवार को मारी जोरदार टक्कर
मोटरसाइकिल सवार युवक गम्भीर रूप से हुआ घायल
रॉन्ग साइड फॉर्च्यूनर टक्कर मारते हुए सीसीटीवी कैमरे में कैद
@noidapolice @noidatraffic pic.twitter.com/rKmW2ZbLHp
— PRIYA RANA (@priyarana3101) January 7, 2024