Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. గాలిలో పది అడుగుల ఎత్తుకు ఎగిరిన వ్యక్తి
Man Flung 10 Feet Into Air | స్కూటర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాలిలో పది అడుగుల ఎత్తుకు ఎగిరాడు. (Man Flung 10 Feet Into Air ) 50 మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: స్కూటర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాలిలో పది అడుగుల ఎత్తుకు ఎగిరాడు. (Man Flung 10 Feet Into Air ) 50 మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 13న గ్రేటర్ నోయిడా ఎకోటెక్ 1 ప్రాంతంలోని గౌతం బుద్ధ విశ్వవిద్యాలయం కూడలి సమీపంలో రోడ్డుపై వెళ్తున్న స్కూటర్‌ను అతి వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో స్కూటర్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పది అడుగుల ఎత్తుకు గాలిలోకి ఎగిరాడు. ప్రమాదం జరిగిన చోట నుంచి 50 మీటర్ల దూరంలో పడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడ్ని దంకౌర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల పవన్‌గా గుర్తించారు. అతడి కుటుంబం ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. స్కూటర్‌ను ఢీకొట్టిన కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
देखिए ग्रेटर नोएडा में स्कूटी सवार युवक को तेज रफ्तार कार ने मारी जोरदार टक्कर, करीब 10 फीट उछलकर युवक 50 मीटर आगे गिरा, स्कूटी सवार की हुई मौत#वायरलवीडियो #up #FarmerProtest2024 pic.twitter.com/1I15NF1n6k
— Lavely Bakshi 🔺 (@lavelybakshi) February 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- air
- car
- Flung
- greater noida
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

