Sunanda Pushkar: సునంద మృతి కేసు.. శశిథరూర్‌కు క్లీన్చిట్ ఇచ్చిన కోర్టు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు విముక్తి లభించింది. భార్య సునందా పుష్కర్ ( Sunanda Pushkar )అనుమానాస్పద మృతి కేసులో ఎంపీ శశిథరూర్‌పై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ ఈ తీర్పును వెలువరించారు. కోర్టుకు బాండ్లు సమర్పించాలని న్యాయమూర్తి తన తీర్పులో ఎంపీ శశిని ఆదేశించారు. కోర్టు తీర్పు తర్వాత శశిథరూర్ రియాక్ట్ అయ్యారు. 7.5 ఏళ్ల పాటు తనను దారుణంగా వేధించినట్లు చెప్పారు.
సునందా పుష్కర్ 2014, జనవరి ఏడో తేదిన అనుమానాస్పద రీతిలో మరణించారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణ చేపట్టారు. సెక్షన్ 302 మర్డర్ కేసు కూడా ఎంపీఐ పెట్టారు. శశిథరూర్‌పై 306 (ఆత్మహత్యాయత్నం), సెక్షన్ 498ఏ (భర్త క్రూరత్వం) సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి విచారించారు. ఈ కేసులో శశిథరూర్ తరపున సీనియర్ అడ్వకేట్ వికాశ్ పాహ్వా వాదించారు.
సునందను మానసికంగా కానీ శారీరకంగా కానీ తన క్లయింట్ వేధించలేదని న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఫోరెన్సిక్, మెడికల్ నివేదికల ప్రకారం సునంది హత్య లేక సూసైడ్ కూడా కాదని చెబుతున్నట్లు కోర్టులో వాదించారు. ప్రమాదవశాత్తు సునంద మరణించి ఉంటుందని కొన్ని నివేదికలను కోర్టుకు సమర్పించారు. నాలుగేళ్ల విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయినట్లు పాహ్వా కోర్టుకు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

