లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత చెంపపై మరో నేత కొట్టబోయారు. అయితే ఆ నేత పక్కనే కూర్చొన్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దీనిని చాలా లైట్‌గా తీసుకున్నారు. ఆయన ముసిముసిగా నవ్వడంతో వేదికపై ఉన్న వారు కూడా అదే పని చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బాహ్‌లో ఈ ఘటన జరిగింది. తిరిగి అధికారాన్ని దక్కించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో జోరును పెంచారు. ఆదివారం బాహ్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు.
కాగా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంజీలాల్ సుమన్ వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. ఎస్పీ జిల్లా అధ్యక్షుడు జితేంద్ర వర్మ, పార్టీ చీఫ్ అఖిలేష్‌తో అదే పనిగా మాట్లాడుతున్నారు. దీంతో రాంజీలాల్ సుమన్ చికాకు చెందారు. ప్రసంగాన్ని ఆపిన ఆయన కొంత ఆగ్రహంతో ఒక్కసారిగా ముందుకు వెళ్లి జితేంద్ర వర్మ చెంపపై కొట్టబోయారు. అయితే పక్కనే కూర్చొన్న ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వెంటనే చేతులు అడ్డుపెట్టి దీనిని అడ్డుకున్నారు.
మరోవైపు ఈ ఘటనకు జిల్లా నేత జితేంద్ర వర్మ షాక్ అయ్యారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం దీనిని లైట్‌గా తీసుకున్నారు. ఆయన ముసిముసిగా నవ్వడంతో వేదికపై ఉన్న ఆ పార్టీ నేతలు కూడా నవ్వుకున్నారు. అనంతరం ప్రసంగించిన అఖిలేష్, తమ పార్టీ అధికారంలోకి వస్తే బాహ్ను జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎస్పీ నేత చెంపపై కొట్టబోయిన మరో నేత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आगराः बाह विधानसभा क्षेत्र में सभा के दौरान सपा के राष्ट्रीय महासचिव और पूर्व सांसद रामजीलाल सुमन ने पार्टी जिलाध्यक्ष जितेन्द्र वर्मा को तमाचा दिखा दिया, जिससे वह सहम गए, यह देखकर अखिलेश यादव हंस पड़े और माहौल को हल्का करने का प्रयास किया pic.twitter.com/hWOrrf9EpV
— gyanendra shukla (@gyanu999) February 7, 2022