రైళ్లలో స్పీకర్ ఆన్ చేసి మొబైల్ చూస్తే 1,000 ఫైన్
రైలు ప్రయాణంలో ఇటీవల తోటి ప్రయాణికుల నుంచి పెరిగిపోతున్న శబ్దకాలుష్యం నివారణకు రైల్వే శాఖ గట్టి చర్యలు చేపట్టనుంది. ఇకపై రైలులో ప్రయాణించేటప్పుడు మొబైల్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా ఫోన్లో గట్టిగా మాట్లాడటం నిషేధం.
- శబ్ద కాలుష్య నివారణకు రైల్వే శాఖ చర్యలు
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : రైలు ప్రయాణంలో ఇటీవల తోటి ప్రయాణికుల నుంచి పెరిగిపోతున్న శబ్దకాలుష్యం నివారణకు రైల్వే శాఖ గట్టి చర్యలు చేపట్టనుంది. ఇకపై రైలులో ప్రయాణించేటప్పుడు మొబైల్ స్పీకర్ ఆన్ చేసి పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా ఫోన్లో గట్టిగా మాట్లాడటం నిషేధం. అలాంటివారిపై సదరన్ రైల్వే కఠిన చర్యలు చేపడుతుంది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా పెద్ద సౌండ్‌తో పాటలు విన్నా, వీడియోలు చూసినా రూ.1,000 ఫైన్ వేస్తారు.
హెచ్చరిక చేసినా వినకపోతే 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.5,000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వేస్ యాక్ట్ కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్లలో కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ వెంటతీసుకెళ్లడం మంచిదని, ట్రైన్లో మొబైల్ వాడేటప్పుడు కచ్చితంగా వాటిని ఉపయోగించాలని రైల్వే అధికారులు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

