Anil Vij | సొంత పార్టీలోని కొందరు నన్ను అపరిచితుడ్ని చేశారు: అనిల్ విజ్
Anil Vij | సొంత పార్టీలోని కొందరు తనను అపరిచితుడ్ని చేశారని బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ హోం మంత్రి అనిల్ విజ్ (Anil Vij) వాపోయారు. అయితే సొంత వారిగా భావించే వారి కంటే కొన్నిసార్లు అపరిచితులే ఎక్కువగా పని చేస్తారని తెలిపారు.
చండీగఢ్: సొంత పార్టీలోని కొందరు తనను అపరిచితుడ్ని చేశారని బీజేపీ సీనియర్ నేత, హర్యానా మాజీ హోం మంత్రి అనిల్ విజ్ (Anil Vij) వాపోయారు. అయితే సొంత వారిగా భావించే వారి కంటే కొన్నిసార్లు అపరిచితులే ఎక్కువగా పని చేస్తారని తెలిపారు. హర్యానాలోని అంబాలాలో జరిగిన బహిరంగ సభలో అనిల్ విజ్ మాట్లాడారు. పేరు ప్రస్తావించకుండా ఒక బీజేపీ నాయకుడ్ని ఆయన విమర్శించారు. ‘నా సొంత పార్టీలోని కొంతమంది నన్ను అపరిచితుడ్ని చేశారు. కానీ కొన్నిసార్లు మన సొంతంగా భావించే వారి కంటే అపరిచితులే ఎక్కువగా పని చేస్తారు’ అని అన్నారు.
కాగా, హర్యానా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత అయిన అనిల్ విజ్ సీఎం పదవి ఆశించి భంగపడ్డారు. దీంతో లెజిస్లేచర్ పార్టీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అలాగే
కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా అనిల్ విజ్ హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో మరింత కలత చెందారు.
మరోవైపు బీజేపీ నేతలు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శించడాన్ని అనిల్ విజ్ పలుమార్లు ఖండించారు. అలాగే తాను బీజేపీని వీడిపోనని చాలా సార్లు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

