Prasant Kishore to Congress | కాంగ్రెస్లో ఆయన చేరికను సమర్ధిస్తున్నా
Prasant Kishore to Congress | తమ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరికను సమర్థిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల రాజకీయాల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరడాన్ని సమర్థిస్తున్నానని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందని ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరికను ఆ పార్టీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన రాకను వ్యతిరేకించొద్దని సహచర సీనియర్ నేతలను మొయిలీ కోరారు.
‘ఎన్నికల రాజకీయ వ్యూహకర్తగా ఆయన రుజువు చేసుకున్నారు.. బయట నుంచి వ్యూహకర్తగా పని చేయడం కంటే పార్టీలోకి వస్తే మరింత ప్రయోజనంగా ఉంటుందని’ ఓ ప్రశ్నకు సమాధానంగా వీరప్ప మొయిలీ చెప్పారు. ఆయన వ్యూహం, ప్రణాళిక కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తాయన్నారు.

ఇక ఎన్నికల వ్యూహకర్తగా తాను వ్యవహరించబోనని ఇటీవల ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. దీనికి తోడు పలుమార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, నాయకులు రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరనున్నారని వార్తలొస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం సోనియాగాంధీదేనని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

