న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనకు కాబోయే అల్లుడికి వార్నింగ్ ఇచ్చారు. కూతురు షానెల్లి ఎంగేజ్మెంట్ వార్తను మంత్రి స్మృతి ఇరానీ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్ అర్జున్ భల్లాతో షానెల్లి ఇరానీ నిశ్చితార్ధం జరిగింది. మోకాళ్లపై కూర్చుని కాబోయే భార్యకు అర్జున్ రింగ్ తొడుగుతున్న ఫోటోను మంత్రి ఇరానీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దానికి ఓ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. మా లాంటి గుండె కలిగిన కుటుంబంలోకి వస్తున్న అర్జున్ భల్లాకు స్వాగతం పలికిన మంత్రి ఇరానీ.. ఆ తర్వాత తన అల్లుడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. మామగా ఓ క్రేజీ వ్యక్తిని ఎనుకున్నావని, ఇక అత్తనైన తనతోనూ జాగ్రత్తగా ఉండాలంటూ స్మృతి ఇరానీ తన పోస్టులో అల్లుడు అర్జున్ను సరదాగా హెచ్చరించారు. అఫీషియల్‌గా వార్నింగ్ ఇస్తున్నాని, దేవుడు మిమ్ముల్ని దీవించాలని కోరుతున్నట్లు తన పోస్టులో మంత్రి స్మృతి ఇరానీ అభిప్రాపయడ్డారు. స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ. జుబిన్ ఇరానీ మొదటి భార్య మోనా ఇరానీ. ఆమెకు పుట్టిన అమ్మాయే షానెల్లి ఇరానీ.