చండీగఢ్: ఒక కూతురు తన తల్లిని దారుణంగా హింసించింది. జుట్టులాగి చెంపలపై కొట్టింది. పలు చోట్ల కొరికింది. కాలితో తన్నింది. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకున్నప్పటికి వదిలిపెట్టలేదు. (Daughter Tortures Mother) ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ తన తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఆమె చెంపపై కొట్టింది. జట్టు పట్టుకుని లాగింది. తల్లి శరీరంపై పలు చోట్ల కొరికింది. ఆమెను కాలితో తన్నింది. హర్యానా భాషలో తిట్టింది. తనను కొట్టవద్దని ఏడుస్తూ ఆ తల్లి వేడుకున్నప్పటికీ కుమార్తె కనికారం చూపలేదు. కొట్టడాన్ని ఆపలేదు.
కాగా, ఆ ఇంట్లో రహస్యంగా రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కుమార్తె తన తల్లిని దారుణంగా హింసించిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఒక కూతురు తన తల్లిని హింసిస్తోంది. అది అత్తగారు కాదు, తన సొంత తల్లి అని తెలిసి నేను షాక్ అయ్యా’ అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. హర్యానా పోలీసులతోపాటు సీఎం నయాబ్ సింగ్ సైనీకి ఈ వీడియో క్లిప్‌ను ట్యాగ్ చేశారు.
A Daughter torturing her Mother.
I’m shock that – it’s her own mother, NOT mother-in-law.@police_haryana@DGPHaryanapic.twitter.com/Npv8dMka2X
— ShoneeKapoor (@ShoneeKapoor) February 27, 2025