Gujarat Boy | వయసు ఆరేళ్లు.. చదివేది ఒకటో తరగతి.. శక్తికి మించిన బరువు అవలీలగా ఎత్తేస్తాడు..!
Gujarat Boy | ఆ బాలుడి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ వయసు పిల్లలు ఆటల్లోనో, పాటల్లోనో మహా అయితే మాటల్లోనో అద్భుతాలు చేసి చూపిస్తారు. కానీ బరువులు ఎత్తగలరా..? అదీ వారి బరువు సుమారు నాలుగింతలు ఎక్కువ బరువును మోయగలరా..? సాధ్యం కాదు కదా..? కానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆరేళ్ల బాలుడు మాత్రం తన శక్తికి మించిన బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు.
Gujarat Boy: ఆ బాలుడి వయసు ఆరేళ్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ వయసు పిల్లలు ఆటల్లోనో, పాటల్లోనో మహా అయితే మాటల్లోనో అద్భుతాలు చేసి చూపిస్తారు. కానీ బరువులు ఎత్తగలరా..? అదీ వారి బరువు సుమారు నాలుగింతలు ఎక్కువ బరువును మోయగలరా..? సాధ్యం కాదు కదా..? కానీ గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆరేళ్ల బాలుడు మాత్రం తన శక్తికి మించిన బరువులను అవలీలగా ఎత్తేస్తున్నాడు.
గుజరాత్ రాష్ట్రం సూరత్ నగరానికి చెందిన యతి జెఠ్వా తనకు రెండేళ్ల వయసప్పటి నుంచే తండ్రితో కలిసి జిమ్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో అతనికి వెయిట్ లిఫ్టింగ్‌పై ఆసక్తి పెరిగింది. దాంతో తండ్రి కూడా ఆ బాలుడిని ప్రోత్సహించాడు. ఇప్పుడు యతి ఏకంగా 80 కిలోల బరువును ఎత్తుతూ ఔరా అనిపిస్తున్నాడు. ఒకటో తరగతి చదువుతున్న యతి ఇప్పటికే వెయిట్ లిఫ్టింగులో 17కు పైగా పతకాలు సాధించాడు.
స్కూల్‌కు వెళ్లి వచ్చిన తర్వాత రోజూ సాయంత్రం రెండు గంటలపాటు జిమ్‌లో ప్రాక్టీసు చేస్తానని యతి జఠ్వా చెప్పాడు. ఉదయం పాలు, అరటిపండు తీసుకుంటానని, మధ్యాహ్నం అన్నం, రాత్రికి చపాతీ తింటానని తెలిపాడు. సాధ్యమైనంత త్వరలో వంద కేజీల బరువు ఎత్తాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. కాగా, వెయిట్ లిఫ్టింగులో యతికి శిక్షణ ఇస్తున్నది అతడి తండ్రి రవి జెఠ్వాయే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

