పాక్ కోసం గూఢచర్యం
పాకిస్థాన్ నిఘా అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా, పంజాబ్‌వ్యాప్తంగా విస్తరించిన ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో నిందితులంతా ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు.
- యూట్యూబర్ సహా ఆరుగురు భారతీయుల అరెస్టు
- డబ్బు ఎరేసి సమాచారం రాబట్టిన పాక్ అధికారులు
చండీగఢ్: పాకిస్థాన్ నిఘా అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా, పంజాబ్‌వ్యాప్తంగా విస్తరించిన ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో నిందితులంతా ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న జ్యోతి మల్హోత్రా అనే మహిళ కూడా నిందితుల్లో ఉన్నారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా వీసా సంపాదించిన జ్యోతి 2023లో పాకిస్థాన్ వెళ్లారు.
తన పర్యటనలో ఆమెకు న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రహ్మాన్ అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భారత్‌లోని కీలక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె ఐఎస్ఐ ఏజెంట్లకు షేర్ చేసేదని విచారణలో తేలింది. 32 ఏండ్ల గుజాలా గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. వీసా సంబంధ కార్యకలాపాలకు పాల్పడిన మలెర్కోట్లకు చెందిన యమీన్ మొహమ్మద్‌ను, పాకిస్థాన్‌కు భారత దేశ కీలక సమాచారాన్ని చేరవేసిన హర్యానాకు చెందిన పీజీ విద్యార్థి దేవేంద్ర సింగ్ ధిల్లాన్నీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఐఎస్ఐ ఆదేశాలపై డిఫెన్స్ ఎక్స్పోని సందర్శించడం వంటి చర్యలకు పాల్పడిన అర్మాన్ని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

