‘ఖలిస్థాన్’ను అణచివేయలేరు
సిక్కుల్లో ఖలిస్థాన్ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తెలిపారు.
- సిక్కులకు ప్రత్యేక దేశం ఎందుకు ఉండకూడదు
- హింస మా మార్గం కాదు.. మా వెనుక ఎవరూ లేరు
- వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్
న్యూఢిల్లీ: సిక్కుల్లో ఖలిస్థాన్ కావాలన్న బలమైన కోరిక ఇంకా నిలిచే ఉన్నదని, దాన్ని ఎవరూ అణచివేయలేరని ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తెలిపారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన అతని అనుచరుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను విడుదల చేయాలంటూ గురువారం అమృత్‌పాల్ అనుచరులు, పలువురు మద్దతుదారులు అమృత్సర్ సమీపంలోని అంజలా పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
లవ్ప్రీత్ను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమృత్‌పాల్ చేసిన హెచ్చరికకు తలొగ్గిన పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం అతడిని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్ మీడియాతో మాట్లాడారు. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌తో ఖలిస్థాన్ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. తమది నిషేధించాల్సిన సంస్థ ఎంతమాత్రం కాదని పేర్కొన్న ఆయన.. పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన కారణంగానే గురువారం హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. తాను హింసావాదిని కాదని, అయితే తన వెనుక ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ‘కొందరు నా వెనుక బీజేపీ ఉండి ఆడిస్తున్నదని అంటుండగా, మరికొందరు పాకిస్థాన్ ప్రోద్భలంతోనే ఇదంతా చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. అయితే నా వెనుక వీరెవ్వరూ లేరు’ అని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

