Covishield Vaccine | కరోనా కేసులు పైపైకి..! కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించిన సీరమ్..!
Covishield Vaccine | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది.
Covishield Vaccine | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి సైతం ధ్రువీకరించారు. కంపెనీ రాబోయే మూడు నెలల్లో ఆరు నుంచి ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ వద్ద కోవోవాక్స్ వాక్సిన్ ఆరు మిలియన్ల డోస్ స్టాక్ ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా కంపెనీ నోవోవాక్స్ తయారు చేసిన వ్యాక్సిన్‌ను కోవోవాక్స్ పేరుతో సీరమ్ ఉత్పత్తి చేస్తున్నది. అలాగే ఆస్ట్రాజెనెకా వాక్సిన్ను కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తున్నది.
ఇదిలా ఉండగా.. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య బూస్టర్ డోస్ తీసుకోవడంతో పాటు వృద్ధులు తప్పనిసరిగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధార్ పూనావాలా విజ్ఞప్తి చేశారు. బూస్టర్ డోస్ టీకా తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్, సబ్ వేరియంట్ల బారినపడకుండా ఉండవచ్చన్నారు. మాస్క్‌లు ధరించడంతో పాటు కోవోవాక్స్ టీకా తీసుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ ప్రస్తుతం కొవిన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నది. ఇదిలా ఉండగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో 7,830 కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరగా.. 40వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం యాక్టివ్ 40,215కి చేరాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,04,771 మంది కోలుకున్నారు. కొత్తగా 24 గంటల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 5,31,016కి పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

