Miss Universe | విశ్వ సుందరిగా నికరాగ్వా చిన్నది.. ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెల్చుకున్న షెన్నిస్ పలాసియోస్
ప్రతిష్టాత్మక 2023 విశ్వ సుందరి కిరీటాన్ని నికరాగ్వా చిన్నది షెన్నిస్ పలాసియోస్ గెల్చుకుంది. 23 ఏండ్ల షెన్నిస్.. నికరాగ్వాలో ఆడియో విజువల్ నిర్మాత, మానసిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.
Miss Universe | న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రతిష్టాత్మక 2023 విశ్వ సుందరి కిరీటాన్ని నికరాగ్వా చిన్నది షెన్నిస్ పలాసియోస్ గెల్చుకుంది. 23 ఏండ్ల షెన్నిస్.. నికరాగ్వాలో ఆడియో విజువల్ నిర్మాత, మానసిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ అందాల పోటీలలో ఆ దేశానికిది మొదటి విజయం. శనివారం రాత్రి జరిగిన మిస్ యూనివర్స్ 72వ ఎడిషన్ పోటీలలో విజేతగా నిలిచిన షెన్నిస్కు అమెరికాకు చెందిన 2022 మిస్ యూనివర్స్ ఆర్.బన్నీ గాబ్రియేల్ కిరీటాన్ని అలంకరించారు.
ఈ పోటీలలో మిస్ థాయ్‌లాండ్ అన్నటోనియా పోర్సిడ్ మొదటి రన్నరప్‌గా, మిస్ ఆస్ట్రేలియా మోరడా విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచారు. శాన్ సాల్వడర్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 84 మంది పోటీపడ్డారు. భారత్‌కు చెందిన మిస్ ఇండియా శ్వేత శారద కూడా పాల్గొని టాప్ 20లో నిలిచారు. అలాగే తొలిసారి పాకిస్థాన్ తరఫున ఎరికా రాబిన్ పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

