రాజ్‌భవన్ ముందు గొర్రెలతో నిరసన..
గొర్రెలతో నిరసన | రాజ్‌భవన్ ముందు గొర్రెల మందతో నిరసన తెలిపింది. మంగళవారం రోజు రాజ్‌భవన్ నార్త్ గేటు వద్దకు నాగరిక్ మన్చా కార్యకర్తలు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్ ముందు అసాధారణ రీతిలో నిరసన చేపట్టారు. గవర్నర్ జగదీప్ ధనఖర్ కరోనా పరిస్థితులను పట్టించుకోకుండా, ఇతర అంశాలపై దృష్టి సారించడం బాధాకరమైన విషయమంటూ కోల్‌కతా నాగరిక్ మన్చా.. రాజ్‌భవన్ ముందు గొర్రెల మందతో నిరసన తెలిపింది. మంగళవారం రోజు రాజ్‌భవన్ నార్త్ గేటు వద్దకు నాగరిక్ మన్చా కార్యకర్తలు గొర్రెలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మన్చా అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. కొవిడ్ రోగులకు సరిపడ బెడ్లు లేవు. రోగులు చనిపోతున్నారు. ఇంత జరుగుతుంటే గవర్నర్ ఇవేవీ పట్టించుకోకుండా, ఇతర అంశాలపై దృష్టి సారించడం సరికాదన్నారు. అందుకే గొర్రెలతో నిరసన చేపట్టామని తెలిపారు.
గవర్నర్ తీవ్ర ఆగ్రహం
గవర్నర్ పుట్టిన రోజునే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ముందు గొర్రెలతో నిరసన చేపడితే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారని గవర్నర్ మండిపడ్డారు. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని పోలీసులను గవర్నర్ ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

