Shashi Tharoor: మోదీని మళ్లీ మెచ్చుకున్న శశి థరూర్.. కోవిడ్ వేళ టీకా దౌత్యంపై ప్రశంసలు
Shashi Tharoor : కోవిడ్ సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ దేశాలతో టీకా దౌత్యాన్ని నిర్వహించిన తీరును శశి థరూర్ మెచ్చుకున్నారు. ఇటీవల మోదీ సర్కారుపై కాంగ్రెస్ నేత శశి థరూర్ పలు మార్లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ నేత శశి థరూర్(Shashi Tharoor). కోవిడ్ సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ దేశాలతో టీకా దౌత్యాన్ని నిర్వహించిన తీరును ఆయన మెచ్చుకున్నారు. ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాలను ప్రశసించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలతో ఇతర సీనియర్ నేతలతో శశి థరూర్ మధ్య దూరం ఏర్పడింది. శశిథరూర్ బీజేపీలో చేరుతారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే కేవలం విదేశీ విధానాలను మెచ్చుకుంటున్నానని, తానేమీ పార్టీ మారడం లేదని థరూర్ ఇటీవల స్పష్టం చేశారు.
తాజాగా ద వీక్ మ్యాగ్జిన్‌లో రాసిన ఓ కథనంలో ఎంపీ థరూర్.. కోవిడ్ మహమ్మారి వేళ కేంద్ర సర్కారు చేపట్టిన వ్యాక్సిన్ డిప్లమసీని మెచ్చుకున్నారు. అంతర్జాతీయ నాయకత్వానికి ఇదో శక్తివంతమైన ఉదాహరణ అని ఆ కథనంలో రాశారు. చాలా బాధ్యతాయుతంగా, ఎంతో సంఘీభావంతో ఆ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కొనియాడారు. కరోనా వల్ల లాక్డౌన్ పరిస్థితి ఏర్పడి అయిదేళ్ల అయిన సందర్భంగా ఆయన ఈ కథనాన్ని రాశారు. ప్రపంచవ్యాప్త ఆరోగ్య దౌత్యంలో భారత ఓ కీలకమైన దేశంగా ఎదిగిందన్నారు. సుమారు వందకుపైగా దేశాలకు రెండు అతిప్రధానమైన కోవిడ్ టీకాలను భారత్ సరఫరా చేసినట్లు తన కథనంలో పేర్కొన్నారు.
మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు సుమారు వందకుపైగా దేశాలకు వెళ్లాయని, అత్యవసరమైన సమయంలో చేయూతను అందించి ఇండియా తన సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. వసుదైక కుటుంబం అన్న భావాన్ని భారత్ వినిపించిందన్నారు. ఉప ఖండంలోని ఇతర దేశాలతోనూ సఖ్యతగా వ్యవహరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇండియా ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని కోవాక్స్ ప్రోగ్రామ్‌కు ఇండియా సహకారం అందించడాన్ని కాంగ్రెస్ నేత ప్రశంసించారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో వ్యాక్సిన్ సరఫరా స్తంభించినా.. అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించినట్లు తెలిపారు. భారత్ తన టీకా దౌత్యాన్ని ప్రదర్శించిన తీరు విదేశీ విధానంలో కీలకమైందన్నారు. మానవత్వాన్ని, వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యవహరించిందన్నారు.
ట్రంప్‌ను వైట్‌హౌజ్‌లో కలవడం, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్, జెలెన్స్కీలతోనూ మోదీ నిర్వహించిన దౌత్య రీతిని థరూర్ గతంలో మెచ్చుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

