న్యూఢిల్లీ, ఆగస్టు 8: కరోనా టీకా వేసుకొన్న వారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కోసం మళ్లీ కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వాట్సాప్‌లోనే పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ప్రకటన చేశారు. వాట్సాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందాలంటే.. టీకా వేసుకొన్నప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్ నుంచి 9013151515కు ‘download certificate’ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కూడా అదే నంబర్‌కు వాట్సాప్ చేయాలి. వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తుంది. వాట్సాప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పంపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకొన్నారు. కొవిన్ అద్భుతంగా పనిచేస్తున్నది అని ప్రశంసించారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు.. మంచి పనులు చేసినప్పుడు అభినందించాలన్నారు.