గౌహతి: ఓ షాంపూ ఏకంగా పెండ్లి రద్దుకు కారణమైన ఘటన అస్సాంలో 14న చోటుచేసుకొన్నది. బార్పేట జిల్లాకు చెందిన యువతికి గౌహతికి చెందిన ఇంజినీర్‌తో వివాహం నిశ్చయమైంది. పెండ్లి కుమారుడి కుటుంబం పెండ్లికుమార్తెకు బహుమతులు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పంపింది. అందులో చౌక షాంపూ ఉందని చెబుతూ.. ‘ఇదేనా నీ స్థాయి?’ అంటూ పెండ్లి కుమారుడికి వధువు వాట్సాప్ మెసేజ్ చేసింది. దీంతో మరో 6 గంటల్లో జరగాల్సిన పెండ్లిని ఆ యువకుడు రద్దు చేసుకొన్నాడు.