చండీగఢ్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా, షెడ్యూల్ విడుదల కాకపోయినా అన్ని పార్టీలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఒక పార్టీ మరో పార్టీలోకి నేతల జంపింగ్‌లు కూడా మొదలయ్యాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ( Amarinder Singh ) పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి.
తాజాగా ఇవాళ కాంగ్రెస్ మాజీ ఎంపీ అమ్రిక్ సింగ్ అలివాల్, మాజీ శాసనభ్యులు హర్జిందర్సింగ్ తేకేదార్, ప్రేమ్ మిట్టల్, ఫర్జానా ఆలం, రజ్వీందర్ కౌర్ భగీకేతోపాటు పలువురు స్థానిక నేతలు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌సింగ్‌తో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించడంతో ఆయన ఆ పార్టీని నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్నారు.