న్యూఢిల్లీ : సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవోవాక్స్ కొవిడ్ టీకాకు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్ పునావాలా వెల్లడించారు. టీకా 12 ఏళ్లు పైబడిన వారందరికి టీకా వేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కోవోవాక్స్ టీకా 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వారికి అందుబాటులోకి వచ్చిన నాల్గో టీకాగా నిలిచింది.
కంపెనీ అత్యవసర వినియోగం కింద టీకా వేసేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల సీడీఎస్సీవో కొవిడ్-19 సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఇటీవల సిఫారు చేసింది. ఈ క్రమంలో తాజాగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. 12-17 సంవత్సరాల మధ్య వయసున్న 2707 మంది పిల్లలపై కంపెనీ ట్రయల్స్ నిర్వహించిందని గత నెలలో ఎస్ఐఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. ట్రయల్స్ కోవోవాక్స్ టీకా ప్రభావవంతంగా, సురక్షితమైందని తేలిందని, రోగనిరోధక శక్తిని చూపించిందని పేర్కొన్నారు.