న్యూఢిల్లీ, జూన్ 3: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ని తయారుచేసేందుకు అనుమతి కోరుతూ డీసీజీఐకి పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసింది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ను పుణెలో ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తున్నది. స్పుత్నిక్ వీ ఉత్పత్తికి గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రో బయాలజీతో (మాస్కో) కూడా ఒప్పందం కుదుర్చుకుంది. పుణెలో సుత్పిక్ వీ ఉత్పత్తికి డీసీజీఐ నుంచి అనుమతి లభిస్తే… తదుపరి దాని అత్యవసర వినియోగానికీ ఎస్ఐఐ అనుమతి కోరనున్నది. జూన్లో 10 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి, సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఎస్ఐఐ తెలిపింది. దీనికి అమెరికా నుంచి రెగ్యులేటరీ అనుమతులు రావాలి. కాగా, భారత్లో సుత్పిక్ వీ ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తయారుచేస్తున్నది.