Siblings Reunite | దేశ విభజన నాడు విడిపోయిన అక్కా, తమ్ముడు.. 75 ఏళ్ల తర్వాత కలిశారు
Siblings Reunite | తోబుట్టువులైన కౌర్, అజీజ్ దేశ విభజన సమయంలో విడిపోయిన సంగతి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం ఆ రెండు కుటుంబాలకు తెలిసింది. ఈ నేపథ్యంలో విడిపోయిన 75 ఏళ్ల తర్వాత కలుసుకోవాలని అక్కా, తమ్ముడు భావించారు.
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో విడిపోయిన అక్కా, తమ్ముడు చివరకు 75 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు (Siblings Reunite). వృద్ధాప్యం వల్ల వీల్ చైర్‌కు పరిమితమైన వారిద్దరూ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు పంజాబ్‌లో నివసించే సర్దార్ భజన్ సింగ్ కుటుంబం దారుణంగా నలిగిపోయింది. ఆ కుటుంబానికి చెందిన వారు చెల్లాచెదురయ్యారు. తోబుట్టువులైన మహేంద్ర కౌర్, అజీజ్ విడిపోయారు. సోదరి కౌర్ తన కుటుంబంతో కలిసి భారత్‌లో ఉండగా, సోదరుడు అజీజ్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు వెళ్లాడు. చిన్నతనంలోనే ముస్లిం యువతిని పెళ్లి చేసుకుని తన కుటుంబంతో కలిసి అక్కడ స్థిరపడ్డాడు. అయితే షేక్ అబ్దుల్ అజీజ్ ఎప్పుడూ కూడా భారత్‌లోని తన కుటుంబ సభ్యులను కలుసుకోలేదు.
కాగా, తోబుట్టువులైన కౌర్, అజీజ్ దేశ విభజన సమయంలో విడిపోయిన సంగతి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విషయం ఆ రెండు కుటుంబాలకు తెలిసింది. ఈ నేపథ్యంలో విడిపోయిన 75 ఏళ్ల తర్వాత కలుసుకోవాలని అక్కా, తమ్ముడు భావించారు. భారత్, పాకిస్థాన్‌ను కలుపుతూ సరిహద్దులో ఏర్పాటు చేసిన కర్తార్‌పూర్ కారిడార్‌లో ఆ రెండు కుటుంబాలు ఆదివారం కలిశాయి. భారత్‌కు చెందిన 81 ఏళ్ల మహేంద్ర కౌర్, పీవోకేకు చెందిన 78 ఏళ్ల సోదరుడు షేక్ అబ్దుల్ అజీజ్ 75 ఏళ్ల తర్వాత తొలిసారి స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. రెండు కుటుంబాల వారు ఒకరిని ఒకరు అప్యాయంగా పలుకరించుకున్నారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించారు. అక్కడ అంతా కలిసి భోజనాలు చేశారు. ఇలా కలుసుకునేందుకు సహకరించిన ఇరు దేశాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు దేశ విభజనప్పుడు విడిపోయిన అక్క కౌర్, తమ్ముడు అజీజ్ 75 ఏళ్ల తర్వాత కలుసుకోవడం చూసి కర్తార్‌పూర్ అధికారులు కూడా చలించిపోయారు. ఇరు కుటుంబాలను పూలమాలలతో సత్కరించారు. వారికి స్వీట్లు పంపిణీ చేశారు. కాగా, 75 ఏళ్ల తర్వాత కలిసిన ఈ తోబుట్టువుల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
An other separated family meetup at kartarpur Corridor (a Corridor of Peace). Mr sheikh Abdul Aziz and his sister Mohinder kaur who got separated at the time of partition in 1947 met at Gurdwara Sri Darbar Sahib kartarpur.
Both families were very happy and praised the government pic.twitter.com/TACb7O7SjH— PMU Kartarpur Official (@PmuKartarpur) May 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

