Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ నియామకం
Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరీ కొత్త డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను కేంద్రం నియమించింది. 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. రెండేళ్ల పాటు ఆయన ఐబీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరీ డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్(Mahesh Dixit)ను కేంద్రం నియమించింది. ఇంటెలిజెన్స్ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉన్నది. 1993 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ఐబీ డైరెక్టర్‌గా ఉన్న తపన్ కుమార్ డేకా స్థానంలో మహేశ్ దీక్షిత్ బాధ్యతలను స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఐబీ చీఫ్‌గా కొనసాగుతారు. అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ ఆమోదం ప్రకారం మహేశ్ దీక్షిత్‌ను నియమించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆయన స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉన్నత పోస్టును స్వీకరించే రీతిలో ఆయన సర్వీస్‌ను పొడిగించారు.
ఇంటెలిజెన్స్ సమాచార సేకరణలో దీక్షిత్‌కు దశాబ్ధాల అనుభవం ఉన్నది. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, జాతీయ భద్రత మేనేజ్‌మెంట్‌లోనూ ఆయన సిద్ధహస్తుడు. ఎన్నో కీలక ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ చేపట్టిన అనుభవం ఆయనకు ఉన్నది. సెక్యూర్టీ వర్గాల్లో ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో అక్కడ సెక్యూర్టీ ఆపరేషన్స్ అన్నీ ఆయనే చూసుకున్నారు. శాంతి భద్రతలను నెలకొల్పడంలో దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. జమ్మూకశ్మీర్ విభజన సమయంలో కూడా సంక్లిష్టమైన ఇంటెలిజెన్స్ బాద్యతలను ఆయనకే అప్పగించారు. రాజకీయంగా సున్నితమైన ఆ ప్రదేశంలో ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు ఆయన తీవ్రంగా శ్రమించినట్లు ప్రభుత్వ వర్గాల్లో గుర్తింపు ఉన్నది.
కశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటువాదుల సవాళ్లను ఎదుర్కొవడంలో ఆయన సమయస్పూర్తిని ప్రదర్శించారు. 2023లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ నిర్వహణలో దీక్షిత్ పాత్ర ఎంతో ఉంది. ఆ శిఖరాగ్ర సదస్సును శాంతియుతంగా జరిగేందుకు ఆయన ఎంతో శ్రమ తీసుకున్నారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలు, సీమాంతర సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా దీక్షిత్ బాధ్యతలు చేపట్టడం కీలకమైన మలుపుగా భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

