Chhattisgarh | దండకారణ్యంలో బయటపడిన మావోయిస్టుల సొరంగ మార్గాలు.. వీడియోలు వైరల్
కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టులు ఏకంగా సొరంగాలనే ఏర్పాటు చేసుకున్న విషయం బయటపడింది.
కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టులు ఏకంగా సొరంగాలనే ఏర్పాటు చేసుకున్న విషయం బయటపడింది. మావోయిస్టులు ఏర్పాటుచేసుకున్న సొరంగాలను మంగళవారం గుర్తించిన పోలీసులు.. వాటి ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సొరంగాలు ఉన్న ప్రాంతం దండకారణ్యంలోని దంతెవాడ అని ప్రాథమికంగా తెలుస్తున్నది. అది ఏ ప్రాంతమో అక్కడి పోలీస్ అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నది. ఒక్కో సొరంగం కొన్ని కిలోమీటర్ల దూరం ఉన్నట్లు సమాచారం. ఒక్కో సొరంగ మార్గం ఒక మనిషి నడిచి వెళ్లేందుకు వీలుగా ఉన్నదని, సొరంగంలో కొన్నిచోట్ల బయట నుంచి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉన్నట్లు వైరల్ అయిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఒక్క దంతెవాడ ప్రాంతంలోనే కాక ఛత్తీస్‌గఢ్‌లోని ఇతర మావోయిస్టు ప్రభావిత జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోనూ సొరంగాలు ఉన్నట్లు అక్కడి పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

