Farmers Protest: ఢిల్లీలో సెక్షన్ 144 విధింపు.. భారీ సమూహాలపై నిషేధం
Chalo Delhi: కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సెక్షన్ 144వ సెక్షన్ విధించినట్లు పోలీసు కమీషనర్ సంజయ్ అరోరా తెలిపారు. మార్చి 12వ తేదీ వరకు కూడా భారీ జనసమూహాన్ని నిషేధించారు.
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ రైతులు ఛలో ఢిల్లీ(Delhi March) కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సెక్షన్ 144వ సెక్షన్ విధించినట్లు పోలీసు కమీషనర్ సంజయ్ అరోరా తెలిపారు. ఫిబ్రవరి 13వ తేదీన రైతు సంఘాలు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మార్చి 12వ తేదీ వరకు కూడా భారీ జనసమూహాన్ని నిషేధించారు. ఎక్కువ సంఖ్యలో జనం గుమ్మికూడరాదు అని పోలీసు ఆఫీసర్ ఆరోరా తెలిపారు.
దేశవ్యాప్తంగా 200 రైతు సంఘాలు, సుమారు 20వేల మంది రైతులు ఢిల్లీపై దండయాత్ర చేయనున్నారు. కమీషనర్ సంజయ్ అరోరా ఇచ్చిన ఆదేశాల్లో ట్రాక్టర్లపై కూడా నిషేధం విధించారు. పిస్తోళ్లు, మండే సామాగ్రిని కూడా పట్టుకెళ్లరాదు. ఇటుకలు, రాళ్లను కూడా తీసుకువెళ్లరాదు. పెట్రోల్ క్యాన్లు, సోడా బాటిళ్లపైన కూడా నిషేధం విధించారు.
లౌడ్ స్పీకర్లను కూడా బ్యాన్ చేస్తున్నట్లు ఆరోరా తన ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే, వారిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. సింగు, ఘాజిపుర్, టిక్రి బోర్డర్ల వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నగరానికి అన్ని వైపుల ఉన్న బోర్డర్లను కట్టుదిట్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- farmers call
- march
- msp
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

