సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు: ఆరోగ్యమంత్రి
Harsha vardhan: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంచేసింది.
‘కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ.. ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నది. ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.
కొవిడ్ విజృంభణపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌లతో ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడారు. అదృష్టవశాత్తు ఆరు నెలలుగా వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉందని, ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవడంవల్ల త్వరలోనే మహమ్మారి మీద విజయం సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

