Second Wave: సెకండ్ వేవ్ ముగియలేదు.. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ అధికం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ( Second Wave ) ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ స్పష్టం చేసింది. 8 రాష్ట్రాల్లో ఆర్ వాల్యూ ( R Value ) అధికంగా ఉన్నట్లు కూడా వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి ఇప్పుడే అంతం అయ్యేలా లేదన్నారు. ఇండియా విషయానికి వస్తే, దేశంలో సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదన్నారు. దేశవ్యాప్తంగా 44 జిల్లాల్లో కేస్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. కేరళ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో పాజిటివిటీ ఎక్కువగా ఉన్నట్లు అగర్వాల్ తెలిపారు. యూపీకి 4.88 కోట్ల కోవిడ్ టీకాలు, మహారాష్ట్రకు 4.5 కోట్లు, గుజరాత్‌కు 3.4 కోట్ల కోవిడ్ టీకాలను పంపిణీ చేసినట్లు అగర్వాల్ చెప్పారు.
ఆర్ వాల్యూ కలవరం..
ఆర్ వాల్యూ అంటే.. రిప్రొడక్టివ్ రేట్ వాల్యూ. వైరస్ సంక్రమణ రెట్టింపు అవుతున్న తీరును ఈ పద్ధతిలో అంచనా వేస్తారు. ఇదో గణిత శాస్త్ర విధానంలో ఉంటుంది. సాధారణంగా ఆర్ వాల్యూ ఒకటి కన్నా తక్కువగా ఉంటే అప్పుడు వైరస్‌తో ముప్పు లేదు. కానీ ఒక పాయింట్ దాటితే అప్పుడు ఆర్ వాల్యూతో ప్రమాదమే ఉంటుంది. ఉదాహరణకు ఆర్ విలువ 0.90గా ఉంటే, అప్పుడు 100 మంది వల్ల 90 మందికి వైరస్ సంక్రమించినట్లు అంచనా. ఒకవేళ ఆర్ వాల్యూ ఒకటి దాటితే, అప్పుడు వైరస్ విజృంభిస్తున్నట్లు భావిస్తారు. చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ఆర్ వాల్యూను ఇటీవల అంచనా వేసింది. జూన్ 30 నుంచి జూలై వరకు ఆర్ వాల్యూ పెరిగినట్లు ఆ సంస్థ పరిశోధకులు తెలిపారు. దీంతో మళ్లీ ఇండియాలో కరోనా కలవరం మొదలైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

