న్యూఢిల్లీ: శాస్త్రవేత్తలు తొలిసారి విజయవంతంగా పూర్తిస్థాయిలో పనిచేసే బయో ప్రింటెడ్ చర్మాన్ని తయారుచేశారు. వేక్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీజెనరేటివ్ మెడిసిన్ పరిశోధకుల ప్రకారం ఈ చర్మంలో మనిషి చర్మంలో ఉండే ఆరు ప్రధాన కణాలుంటాయి.
మనిషి చర్మంలో ఉన్నట్టే ఇందులోనూ మూడు పొరలుంటాయి. కాలిన గాయాలు, పుండ్లను మాన్పడంలో బయోప్రిటెండ్ చర్మం ఎంతో ఉపయోగపడుతుందని అధ్యయన సారథి డాక్టర్ అంథోనీ అటాలా అన్నారు.