న్యూఢిల్లీ : మనకు తెలిసి ఆరు రుచులున్నాయి. ఆధునిక సైంటిస్టుల లెక్క ప్రకారం ప్రాథమిక రుచులు ఐదే. తాజాగా ఆరో రుచి.. అమ్మోనియం క్లోరైడ్ వల్ల ఏర్పడుతున్నదని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా సైంటిస్టులు కనుగొన్నారు.
మానవుడి నాలుకకు ఆరో ప్రాథమిక రుచి అనుభూతి ‘అమ్మోనియం క్లోరైడ్’ వల్ల ఏర్పడుతున్నదని వారు నిర్ధారించారు. వీరి పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో ప్రచురితమయ్యాయి. స్కాండినేవియన్ చాక్లెట్స్లోని అమ్మోనియం క్లోరైడ్ భిన్నమైన రుచిని ఏర్పరుస్తున్నదని పరిశోధకులు కనుగొన్నారు.