కరోనా కన్న డేంజర్!

- అండమాన్ దీవుల్లో సీ.ఆరిస్ ఫంగస్
- దేశంలోనే మొట్టమొదటిసారి గుర్తింపు
- ఢిల్లీ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి
- ఔషధాలకూ లొంగదు
- ఎక్కడ పుట్టిందన్నది ఇప్పటికీ మిస్టరీనే
- జపాన్‌లో మొదటిసారి ఫంగస్ ఆనవాళ్లు
న్యూఢిల్లీ, మార్చి 18: ఎక్కడ పుట్టిందో తెలియదు. ఎలా వ్యాపిస్తుందో తెలియదు. ఏ వాతావరణంలో జీవిస్తుందో తెలియదు. మందులకు లొంగదు. కరోనా మహమ్మారి గురించి కాదు ఇదంతా. అంతకన్నా ప్రమాదకరమైన ఓ ఫంగస్‌ను భారత శాస్త్రవేత్తలు అండమాన్ దీవుల్లో గుర్తించారు. దాని పేరు క్యాండిడా ఆరిస్. అండమాన్‌లోని రెండు ప్రాంతాల్లో దీనిని గుర్తించారు. దీనినే సీ.ఆరిస్ అంటారు. ఔషధాలకు లొంగని కారణంగా సూపర్ బగ్ అని కూడా పిలుస్తారు. కరోనా కన్నా ఇది వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని, ఈ ఫంగస్ విస్తరిస్తే ఏడాదిలో కోటి మందికిపైగా చనిపోవచ్చని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. భారతదేశంలో ఈ ఫంగస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అనురాధ చౌదరి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అండమాన్ దీవుల్లోని 8 ప్రాంతాల్లో మట్టి, నీటి నమూనాలను సేకరించింది. ఇందులో రెండు ప్రాంతాల్లో సేకరించిన నమూనాల్లో సీ.ఆరిస్ కనిపించింది. అందులో జనసంచారం ఎక్కువగా ఉండే ఓ బీచ్ కూడా ఉన్నది. ఫంగస్ ఇక్కడే పుట్టిందా.. మనుషుల నుంచి ఇక్కడకు చేరిందా అన్నదానిపై స్పష్టత లేదు.
పదేండ్ల కింద తొలిసారి
ఈ ఫంగస్ ఎలా వ్యాపిస్తుందన్న విషయం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ మిస్టరీనే. వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణం కావొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫంగస్‌ను మొట్టమొదట 2009లో జపాన్‌లో ఓ రోగి శరీరంలో గుర్తించారు. 2019లో 270 మందిలో ఇది కనిపించింది. వీరిలో 8 మంది చనిపోయారు. ఈ ఫంగస్ మనిషి శరీరంపై చేరి అక్కడే ఉండిపోతుంది. గాయం అయినప్పుడు దాని గుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది. ఇది సోకినప్పుడు మొదట ఏ లక్షణాలు కనిపించవు. కొద్ది రోజుల తర్వాత తీవ్ర చలి జ్వరం వస్తుంది. సెప్సిస్‌కు దారితీస్తుంది. మందులకు సులభంగా లొంగని కారణంగా ప్రాణాపాయం ఎక్కువ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

