School Teacher Shot Dead By Cop | స్కూల్ టీచర్‌ను కాల్చి చంపిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్
School Teacher Shot Dead By Cop | పరీక్షల విధుల్లో ఉన్న స్కూల్ టీచర్‌ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్, పొగాకు ఇవ్వనందుకు టీచర్‌ను హత్య చేశాడు.
లక్నో: పరీక్షల విధుల్లో ఉన్న స్కూల్ టీచర్‌ను సెక్యూరిటీ విధుల్లో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్పులు జరిపి చంపాడు. మద్యం సేవించి ఉన్న ఆ పోలీస్, పొగాకు ఇవ్వనందుకు టీచర్‌ను హత్య చేశాడు. (School Teacher Shot Dead By Cop) ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. వారణాసికి చెందిన విద్యా శాఖ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి పోలీస్ భద్రత మధ్య బోర్డ్ హైస్కూల్ పరీక్షల జవాబు పత్రాలను పలు కాలేజీలకు వాహనంలో తరలించారు. ఆదివారం రాత్రి చివరగా ముజాఫర్‌నగర్‌లోని కాలేజీకి వాటిని తీసుకువచ్చారు.
కాగా, వాహనంలో ఉన్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చందర్ ప్రకాష్ మద్యం సేవించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ధర్మేంద్ర కుమార్‌ను పొగాకు అడిగాడు. ఆ టీచర్ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌తో ధర్మేంద్ర కుమార్‌పై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఉపాధ్యాయుడు ధర్మేంద్ర కుమార్‌పై కాల్పులు జరిపి హత్య చేసిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చందర్ ప్రకాష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందన్న దానిపై ఆ వాహనంలో ఉన్న మిగతా వారిని ప్రశ్నించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

