Scary video: సాధారణంగా విషపూరిత సర్పాలు తమ పరిసరాల్లో ఏదైనా అలజడిని గమనిస్తే వెంటనే అప్రమత్తమవుతాయి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. అలా పారిపోయే క్రమంలో ఏ అడ్డంకి ఎదురైనా ఎగబడి కాటేస్తాయి. ఈ విషపూరిత సర్పాల్లో నాగుపాము, రక్తపింజరి చాలా ప్రమాదకరం. నాగుపాము కరిస్తే నాడీ వ్యవస్థపై, రక్తపింజరి కరిస్తే కండరాలపై విష ప్రభావం పడి కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే, పాములు ఆత్మరక్షణ కోసం ఇతర జీవులను కాటేయడం సర్వసాధారణం. కానీ ఏదైనా విష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..?
ఎప్పుడూ చూడలేదు కదా..? అలాగైతే ఈ కింది వీడియోను మీరు తప్పక చూడాల్సిందే. ఆడ్లీ టెర్రిఫైయింగ్ పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది. అయినా ప్రాణాలు పోకపోవడంతో ఆ పాము దేహభాగం ఇంకా కొట్టుకుంటోంది. ఈ క్రమంలో పాము దేహం వచ్చి తెగిపోయి పక్కన పడివున్న తలకు తగిలింది. అంతే ఆ తల నోరు తెరచి తన దేహాన్ని తనే గట్టిగా కాటేసి పట్టుకుంది. ఆ కాటువల్ల కలిగిన మంటకు పాము దేహం ఒక్కసారిగా మరింత వేగంతో కొట్టుకోవడం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఈ భయం పుట్టించే దృశ్యంపై మీరూ ఓ లుక్కేయండి..
Watch as decapitated snake bites it’s own body 😳 pic.twitter.com/lIneCEZvfU
— OddIy Terrifying (@OTerrifying) May 2, 2023